మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఈసం నారాయణ సకుటుంబ,సపరివారంతో వనదేవతలను దర్శించుకున్నారు. ఆదివాసి సంప్రదాయాల ప్రకారం పూజారులు ఎండోమెంట్ అధికారులు డోలు వాయిద్యాలతో స్వాగతం పలికారు. సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీరే సారే సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డాక్టర్ ఈసం నారాయణ మాట్లాడుతూ మేడారం జాతరకు తొందరగా పాలకమండల్ని ఏర్పాటు చేస్తే తొందరగా పనులు సకాలంలో జరుగుతాయన్నారు. వనదేవతల జాతర, ఆదివాసి సంప్రదాయాలు ప్రకారం జాతర ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వానికి గుర్తు చేశారు. కోటి 50 లక్షల పైచిలుకు వచ్చే భక్తులకు జాతరలో ఏర్పాట్లు తొందరగా పూర్తి చేయాలని, జాతర భక్తుల సౌకర్యార్థం స్థానిక అవసరాలైన త్రాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యం ఎలాంటి అమాంఛనీయ సంఘటన జరగకుండా సరైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. బంధుమిత్రులు కుటుంబ సభ్యులు ఉన్నారు.