మండలంలో ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రేగ కేశవరావు ఆధ్వర్యంలో మండలంలోని ఉన్న అన్ని ప్రాథమికోన్నత ఆశ్రమ పాఠశాల నుంచి బుధవారం ఇంద్రనగర్ పాఠశాలలో వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఇంగ్లీష్ మీడియంలో వ్యాసరచన పోటీలో విజేతలైన కె ప్రశాంతి ఏ హెచ్ ఎస్ గర్ల్స్ఊరట్టం పాఠశాల నుండి, వి ఉమారాణి కేజీబీవీ ఆశ్రమ పాఠశాల నుండి, తెలుగు మీడియం విద్యార్థులకు జి నాగ చైతన్య జడ్.పి.హెచ్.ఎస్ ఇంద్రానగర్ పాఠశాల, జి ప్రశాంతి ఇంద్రనగర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల నుండి విజేతలుగా నిలిచారు. వీరు జిల్లా సాయి వ్యాసరచన పోటీలకు ఎంపిక అయినట్లు తెలిపారు. విజేతలకు సత్కరించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రేగ కేశవరావు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి కష్టపడి చదవడం అలవర్చుకోవాలన్నారు. ఉన్నత లక్ష్యాలనుంచుకొని ఆ దిశగా నిరంతరం సాధన చేయాలని సూచించారు. క్రమశిక్షణతో ఉంటే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు అన్నారు. సెల్ ఫోన్లతో సమయాన్ని వృధా చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శంకర్, రజిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.