క్రీడలతో మానసిక ఉల్లాసం : ఎస్సై రమేష్

నవతెలంగాణ – వీర్నపల్లి
క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక రుగ్మతలను దూరం చేసుకోవచ్చని, దీంతో పాటు మంచి క్రమశిక్షణ కలిగి ఉండడం వలన సమాజంలో మంచి పేరు తెచ్చుకోవచ్చని  ఎస్సై జిల్లెల రమేష్  అన్నారు. వీర్నపల్లి మండలం మాడల్ స్కూల్ గ్రౌండ్ లో మండల స్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలను గురువారం ఎస్సై రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు దోస్తీ మిట్ 2024 పోటీలను నిర్వహించడం జరిగింది.క్రీడాకారులు ఆటల్లో ఉత్సంగా రాణించిలని  సూచించారు. ఈ కార్యక్రమంలో పిడి ప్రతాప్ కుమార్, పి టి రాకేష్, హెడ్ కానిస్టేబుల్ లక్ష్మన్, కానిస్టేబుల్ ప్రశాంత్, నu యువజన సంఘాల నాయకులు క్రీడ కారులు ,యువకులూ తదితరులు పాల్గొన్నారు.

Spread the love