నెల రోజుల నుంచి కల్లంలోనే ఉంటున్నాం

నవతెలంగాణ – వీర్నపల్లి 

వీర్నపల్లి మండలం రంగం పేట గ్రామంలో అల్మాస్ పూర్ సొసైటీ అధ్వర్యంలో కొనుగోలు కేంద్రంలో రైతులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతు నెల రోజుల నుంచి కళ్ళంలోనే ఎండనక రాత్రి అనక వడ్ల వద్దనే ఉంటున్నాం ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకునేందుకు నాన కష్టాలు పడుతున్నాం. మ్యాచర్ వచ్చీ రోజులు గడిచిన తూకం వేయడం లేదనీ రైతులు మండి పడుతున్నారు. రాత్రీ పందులు పగలు కోతులు ధాన్యం రాశులు బుక్కుతున్నాయి . నెల రోజుల ముందు కోసిన వడ్లు తుకాం వేయక నాలుగు రోజుల క్రితం పోసిన ధాన్యం ను తూకం వేస్తూ ఇష్టం వచ్చినట్లు కోనుగోలు నిర్వహకులు చేస్తున్నారనీ ఆరోపించారు.గతంలో ఐకేపీ సెంటర్ వారు ఇలా చేయలేదు సీరియల్ గా తూకం వేశారు. కొనుగోలు కేంద్రంలో దాదాపు 25 లారిల లోడ్ వడ్లు ఉన్నాయి .ఇప్పటికైనా అధికారులు స్పందించి పెరుకపోయినా ధాన్యం ను వెంటనే కోనుగోలు చేయలని రైతులు కోరుతున్నారు.
Spread the love