రిజర్వేషన్ ఖరారు కాకముందే ..పల్లెల్లో పంచాయతీల జోరు

నవతెలంగాణ – మోపాల్ 

జిల్లాలో గ్రామపంచాయతీల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్  రాకముందే,  సర్పంచ్ ఎన్నికలపై గ్రామలలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది. ఇంకా రిజర్వేషన్ కూడా ఇంకా పూర్తి కాలేదు కానీ పల్లెల్లో రాజకీయ వాతావరణ మాత్రం వేడెక్కుతుంది. ఒకవేళ పాత ప్రకారం రిజర్వేషన్ వస్తుందా లేకపోతే, కొత్తగ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కదా రిజర్వేషన్లు మార్పులు చేర్పులు ఉంటాయని ఆశావాహులు మాత్రం గంపెడు  ఆశలతో ఉన్నారు. ముఖ్యంగా గ్రామాలలో సర్పంచ్ పదవికి పోటీ తీవ్రంగానే ఉంటుంది రోజురోజుకీ రాజకీయ నిరుద్యోగిత పెరిగిపోతుంది కాబట్టి సర్పంచ్ పదవికి అధిక ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఒకవేళ రిజర్వేషన్ మగవారికి కాకుండా మహిళా రిజర్వేషన్ ఏర్పడితే వారి సతీమణులను కూడా ఎన్నికల్లో పోటీ చేయించడానికి సైతం ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా యువత కూడా ఈసారి గ్రామపంచాయతీ ఎన్నికల కోసం ఇప్పటినుండే పోటీ చేయడానికి నూతన ఉత్సాహం చూపుతున్నారు. గ్రామంలో సర్పంచ్ పదవికి ప్రత్యేక స్థానం ఉంటుంది కావున ఈసారి పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఎన్నికల ఖర్చుకు సైతం లెక్కచేయకుండా ఉన్నారు .మేజర్ గ్రామపంచాయతీలకైతే నలభై లక్షల పైబడి ఖర్చు చేయడానికి కూడా ఆశావాహులు మోగ్గు చూపుతున్నారు. ఒకసారి అదృష్టం కలిసి వస్తే ఐదు సంవత్సరాలు గ్రామంలో మనది రాజ్యం అని చూస్తున్నారు. కానీ సర్పంచ్ ఎన్నికల్లో ప్రత్యేక వాతావరణం ఉంటుంది. ఎక్కడ కూడా రాజకీయ పార్టీల గుర్తులపై పోటీ చేసే నిబంధన గ్రామపంచాయతీలకు రాజ్యాంగంలో లేదు, కాబట్టి ఒకే పార్టీకి సంబంధించిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కూడా సర్పంచ్ పదవికి పోటీ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
ముఖ్యంగా గ్రామాలలో పోటీ చేసే వ్యక్తి యొక్క అంగ బలం మరియు ఆర్థిక బలం పైనే సగం గెలుపు ఆధారపడి ఉంటుంది. మిగతా సగం తమ కుల రాజకీయం పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తే అతనిపై సానుభూతి మాత్రం చాలా మట్టుకు తమ గెలుపుకు ఉపయోగపడుతుంది.  దేశానికి రాష్ట్రపతి ప్రథమ పౌరుడైతే, గ్రామానికి సర్పంచ్ ప్రథమ పౌరుడు కాబట్టి గ్రామాల్లో వివిధ రకాల ఎన్నికల్లో కంటే సర్పంచ్ పదవికి మాత్రం ప్రత్యేక వాతావరణం నెలకొల్పబడి ఉంటుంది. చాలామంది ప్రస్తుత ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు, మంత్రులు తమ రాజకీయ జీవితం సర్పంచ్ పదవి నుండి తమ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. కాబట్టే ఈ పదవికి ప్రత్యేక స్థానం నెలకొల్పబడింది. వేచి చూడాలి ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ వస్తుందో ఎవరికి ఆ పదవిలో కూర్చునే అదృష్టం వరిస్తుందో..
Spread the love