ప్రతి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం దళిత, గిరిజన సంక్షేమం పట్ల నిరంతరం ప్రచారం చేయడం, నిధులు కేటాయించడం చేస్తున్నది. ఏడు దశాబ్దాలు గడిచిన ప్రాపకాలజ్ఞతగా అభివృద్ధి చెందడమే తప్ప ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేసి ఈ వర్గాలను అభివృద్ధి చేసే ఆలోచన ప్రభుత్వాలకు లేదు. భూములు పంపిణీ చేస్తామని ప్రతిసారి చెప్పడమే తప్ప వారికి ప్రస్తుతం ఉన్న భూములను ప్రభుత్వాలే లాక్కుంటున్నాయి. రాష్ట్రంలో 16శాతం దళితులు, 6శాతం గిరిజనులు ఉన్నారు. దళిత జనాభా 55 లక్షలు కాగా, గిరిజన జనాభా 33 లక్షలు ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సమాజా భివృద్ధికి తగిన విధంగా వీరి అభివృద్ధి లేదు.
దళితుల సంక్షేమం : దళితుల్లో 33 శాఖలు ఉన్నాయి. వీరి మధ్య ఐక్యత లేకుండా పాలకులు నిరంతరం వివాదాలు సృష్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభు త్వం విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడానికి అనేక పథకాలు ఉన్నప్పటికీ అక్ష్యరాస్యత దళితుల్లో 58.90 శాతం మాత్రమే ఉంది. మహిళల్లో 50 శాతం మించలేదు. జాతీయ స్థాయిలో దళితుల అక్ష్యరాస్యత 66.54గా ఉంది. జాతీయ స్థాయికన్న తక్కువలో ఉంది. మొత్తం అన్ని వర్గాల అక్ష్యరాస్యత జాతీయ స్థాయిలో 72.98 శాతంగా ఉంది. నిరంతరం దళితుల అక్ష రాస్యత గురించి వల్లించే ప్రభుత్వాలు వారి గూడెలలో గల పాఠశాలలను ఎత్తివేస్తున్నారు. ప్రయివేట్ పాఠశాలలను ఏర్పాటు చేయడం ద్వారా ఫీజులు చెల్లించలేక 5-19 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు కూలీలకు వెళ్తున్నారు. రాష్ట్రంలోని దళిత బిడ్డలకు విద్య పథకాన్ని ప్రకటించి 10.85 లక్షల మందికి 268 గురుకులాలలో విద్య బోధన కల్పిస్తామని ప్రస్తుతం 1.73 లక్షల మందికి మాత్రమే విద్య అమలు జరుపుతున్నారు.
దళితుల అభివృద్ధి కోసం అనేక పథకాలను, వాటి వేల కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రధానంగా ప్రభుత్వ శాఖల కేటాయింపులలో 15 శాతం బడ్జెట్ దళిత ఉప ప్రణాళిక కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటా యింపులు చేస్తున్నాయి. తెలం గాణ రాష్ట్ర ఉప ప్రణాళికలో 2014 నుండి నేటి వరకు కేటాయించిన నిధులలో రూ. 63,182.10 కోట్లు దారి మళ్ళిం చారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ తరుపున కేటాయించిన అభివృద్ధి నిధులు రూ.21,322.75 కోట్లు పూర్తిగా వ్యయం చేయలేదు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1.80 లక్షల మందికి ఇస్తా మన్న రూణాలు అమలు కాలేదు. ఇదే కాలానికి రాష్ట్ర బడ్జెట్‌లో దళితులకు కేటాయించిన రూ.2,99,110 కోట్లలో 60 శాతం మాత్రమే వ్యయం చేశారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా గత తొమ్మిదేండ్లలో రూ.7,39,107 కోట్లు ఉప ప్రణాళిక కింద రూ. 54,214 కోట్లు అంబరిల్ల పథకం కింద బడ్జెట్ కేటా యించినట్లు చూపారు. కానీ వ్యయం చేసిందే తక్కు వ. ఇన్ని వేలకోట్లు కేటాయించిన దళిత జనాభాలో నేనికి ఆరు శాతం మంది సరైన అవాసలు, విద్య, వైద్య సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలో భూముల పంపిణీలో దళితులు నిర్ల క్ష్యానికి గురయ్యారు. రాష్ట్రంలో 163 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. 16.37 లక్షల దళిత కుటుంబాలలో 7.12 లక్షల మందికి 13.12 లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉంది. మిగిలిన వారికి ఎలాంటి భూమి లేదు. ప్రతి కుటుంబానికి మూడెకరాల భూమి పథకాన్ని 2015 మార్చి 15న ముఖ్య మంత్రి ప్రారంభించారు. 9 సంవత్సరాలలో 6,242 మందికి 15,571 ఎకరాలు పంపిణీ చేసి ప్రభుత్వం పథకాన్ని ఉపసంహరించుకుంది. చివరికి గతంలో వారికి ఇచ్చిన ఆసైన్డ్ భూములను ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, చెట్ల పెంపకం పేరుతో ల్యాండ్ ఫూలింగ్ ద్వారా 30 వేల ఎకరాలు లాక్కుంటు న్నారు. 2018-19లో దళిత క్రూషియల్ ఫండ్ ప్రకటన చేశారు. అది కాగితాలకే పరిమితమైంది. 2021లో ముఖ్య మంత్రి దళితబంధు ప్రకటించి 2023 ఫిబ్రవరి నాటికి 38,328 మందికి మాత్రమే 10 లక్షల చొప్పున పంపిణీ చేసి, ఆ తరువాత 4-5 గురికి కలిపి పథకానికి ప్రకటిస్తున్నారు. ఇంకా మిగతా 18 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గానికి 1100 దళిత కుటుంబాలకు దళిత బంధును ప్రకటించారు. 2023-24 సంవత్సరానికి 17 లక్షల మందికి రూ.17,700 కోట్లు ప్రకటించారు. కానీ, ఆరు మాసాలు గడుస్తున్నా బడ్జెట్ కేటాయింపుల అమలు లేదు. నేటికి అంటరానితనం కొనసాగు తూనే ఉంది. దళితులపై 66 గ్రామాల్లో 12,634 దాడులు, దౌర్జన్యాలు జరిగినట్లు నేషనల్ క్రైమ్ రిపోర్టు బ్యూరో ప్రక టించింది. మూడు ఏండ్లలో 34,498 మంది అన్ని వర్గా ల బాలికలు అదృశ్యమయ్యారు. ఇందులో బలహీన వర్గాలు చెందిన వారే ఎక్కువ.
గిరిజన సంక్షేమం : వీరిలో 32 శాఖలు ఉన్నాయి. షెడ్యూ ల్డ్ ప్రాంతంలో ఉన్న వారికేగాక నాన్ షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు గిరిజన చట్టాల రక్షణ లేదు. 1505 షెడ్యూల్డ్ గ్రామాలు కాగా, 247 నాన్ షెడ్యూల్డ్ గ్రామాలు ఉన్నాయి. 37 మండలాలను మాత్రమే షెడ్యూల్డ్‌గా ప్రకటించారు. వీరు ప్రధా నంగా ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ ఉమ్మ డి జిల్లాల్లో ఉంటున్నారు. రాష్ట్రంలో గిరిజన ఉప ప్రణాళిక కింద 2014 నుండి 2024 వరకు రూ.91,529 కోట్లు, ఇదే కాలానికి బడ్జెట్ కింద రూ.80,136 కోట్లు కేటాయించారు. వీరికి తోడు దేశంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో గిరిజన సబ్‌ప్లాన్ కింద 1,19,509 కోట్లు, అంబరిల్లా పథకం కింద 4,292 కోట్లు కేటా యించారు. ఇన్ని నిధులు కేటాయించిన విద్య, వైద్య రంగాలలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. వీరిపై పోడు భూముల సాగు ఆక్రమ కేసులు బనాయించి జైళ్ళపాలు చేశారు. కొన్ని శాఖలకు ‘లిపి’లేదు. అందుకు ఎలాంటి ప్రయత్నం జరగలేదు. దేశంలో అక్షరాస్యత 74శాతం కాగా, రాష్ట్రంలో అక్షరాస్యత 66.5 శాతం ఉన్నప్పటికి గిరిజనులలో పురుషులలో 60శాతం, మహిళలలో 45శాతం మాత్రమే ఉంది. కేరళలలో 85 శాతం అక్షరాస్యత ఉంది. డబుల్‌బెడ్ రూం కింద చేసిన నిర్మాణాలలో దళిత, గిరిజ నులకు 50శాతం, మైనార్టీలకు 7శాతం, ఇతరులకు 43 శాతం నిర్ణయించారు. కానీ దశాబ్దాలు గడిచినా గిరిజనులు పూరి గుడి సెల్లోనే నివాసం ఉంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు అవాసలు దెబ్బతిన్నప్పటికి ఎలాంటి పరిహారాలు ఇవ్వడం లేదు.
ఇండ్ల స్థలాలకు భూములు ఉన్నప్పటికీ వారికి పంపిణీ చేయకుండా బేదకల్ చేస్తున్నారు. రవాణా సౌకర్యం లేని గ్రామా లు అనేకం ఉన్నాయి. మౌలిక వసతులు కల్పించాలన్న ఆందో ళన నేటికీ కొనసాగుతూనే ఉంది. చివరకు రాజ్యాంగం కల్పిం చిన అవకాశాలను కూడా గత ప్రభుత్వాలు అమలు చేయలేదు. వాటి అమలు కోసం సంఘాలు పెట్టి చేసిన పోరాటాలను అణిచి వేయడమే తప్ప సమస్యల పరిష్కారానికి ఎలాంటి కృషి లేదు. ఇప్పటికీ అక్ష్యరాస్యతలో అట్టడుగున ఉన్నారు. గిరిజను లకు ఉన్న భూములను అభయారణ్యాల పేరుతో వేల ఎకరాల నుండి తొలగించారు. 2022 నాటికి అందరికి పోడు భూము లకు పట్టాలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం లక్ష 96,676 మందికి, 721 కమ్యూనిటీ వ్యవస్థలకు మాత్రమే పంపిణీ చేశారు. గిరిజన వికాసం పేరుతో సన్న, చిన్నకారు రైతులకు సహకారం చేస్తామని చేసిన ప్రకటన అమలుకు నోచుకోలేదు. గిరిజన సంక్షేమ విద్యాలయాలలో ఐఐటి, ఎన్‌ఐటి, పిహెచ్‌డికి సీట్లు లేకపోవడంతో అభివృద్ధి కానరావడం లేదు. విదేశీవిద్య కోసం ఉపకార వేతనాలు ఇస్తామని నిరంతరం ప్రకటించిన ప్రభుత్వ పథకాన్ని పొందడానికి కార్యాలయాల చుట్టూ తిరుగు తున్నారు. దశాబ్దాలుగా సాగులో ఉన్న వీరి భూములను లాక్కో వడమే గాక జైళ్లలోనూ పెట్టారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు షెడ్యుల్ 5, 6 అమలు కోసం పోరాటాలు చేయాల్సి వస్తున్నది. గిరిజన తెగల మధ్య వివాదాలు సృష్టించి పాలకులే వారి ఐక్యత ను దెబ్బతిస్తున్నారు. ఎన్నికలు జరిగినప్పడు గిరిజన అభివృద్ధికి వాగ్ధానాలలో 20శాతం కూడా అమలు కావడం లేదు. మారు తున్న సమాజాభివృద్ధికి అనుకూలంగా వీరి సంస్కృతి కూడా అభివృద్ధి చెందాలి. వీరి కోసం ప్రకటించిన పథ కాల అమలుకు గ్రామ సభల ద్వారా వ్యయం చేయాలి. గిరిజనేతర కాంట్రాక్టర్లు గిరిజనాభివృద్ధికి అటంకంగా నిధులు కాజేస్తున్నారు. ప్రతి గిరి జన పల్లెలో పాఠశాల, మండలంలో నాలుగు వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలి. నేటికి వైద్య సహాయం కోసం అటవీ ప్రాంతాల నుండి రాలేక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పౌష్టికాహార లోపం వల్ల ఐదేండ్లలోపు పిల్లల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి.
23 శాతం జనాభా కలిగిన దళిత, గిరిజన ప్రజల అభివృద్ధి లేకుండా రాష్ట్రం, దేశం అభివృద్ధి కాదు. వీరి కేటాయింపులు వీరి అభివృద్ధి సంఘాల ద్వారానే వ్యయం చేయాలి. మధ్య దళారీల వ్యవస్థను తొలగించాలి. సమాజంలో వీరిని భాగస్వాములను చేయాలి. అప్పుడే వీరి బతుకుల్లో కొంతైనా వెలుగులు నింపడం సాధ్యం.
సారంపల్లి మల్లారెడ్డి
9490098666