పాలకులు మారినా పామాయిల్ రైతుల కష్టాలు మారవా.? 

– పామాయిల్ బోర్డు ఏర్పాటు చేయాలి – జూలకంటి సూటి ప్రశ్న.
– పంటకు భరోసా కల్పించాలి – పోతినేని
– పామాయిల్ కు హామీ ధర చట్ట చేయాలి – టి.సాగర్
– రెండో పరిశ్రమ నిర్మాణం తెలంగాణ రైతు సంఘం పోరాటం ఫలితమే – నున్నా నాగేశ్వరరావు
– విజయవంతం అయిన పామాయిల్ రైతు సంఘం సదస్సు….
నవతెలంగాణ – అశ్వారావుపేట 
పాలకులు మారుతున్నా ఐదేండ్లు కు ఒక సారి పామాయిల్ సాగు దారులు బతుకులు మారడం లేదని, వీరి బతుకులు మారాలంటే పసుపు బోర్డ్ మాదిరిగా పామ్ ఆయిల్ సాగు దారులు అభివృద్ది కోసం ఆయిల్ ఫాం బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐకేఎస్ కేంద్రకమిటీ సభ్యులు  జూలకంటి రంగారెడ్డి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసారు. తెలంగాణ పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర సదస్సు రాష్ట్ర కన్వీనర్ కొక్కెరపాటి పుల్లయ్య అద్యక్షతన శనివారం అశ్వారావుపేట,లహరి గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సు కు ముఖ్య అతిథిగా హాజరై ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశ సంపదకు మూలం రైతులు, శ్రామికులే నని ఫెడరేషన్ పేరుతో పామ్ ఆయిల్ సొమ్మును కొందరు గద్దల్లా తన్నుకు పోతున్నారు అని అన్నారు. వ్యవసాయం కోసం బడ్జెట్ కేటాయించడంమే తప్ప కేంద్రరాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి వ్యయం చేయడం లేదని అన్నారు.గతేడాది రూ.730 కోట్లు కేటాయించి రూ.400 కోట్లు మాత్రమే నిధులు విడుదల చేసి రూ.300 కోట్లు మాత్రమే కేంద్రప్రభుత్వం కర్చు చేసిందని అన్నారు. కార్పోరేట్,పెట్టుబడి దారులకు అనుకూలంగా రైతాంగానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరించడం బాధాకరం అని అన్నారు. ఒక కోటి ముప్పై లక్షల టన్నుల పామాయిల్ ను భారతదేశం రూ 80 వేళ కోట్లు వెచ్చించి ఇతర దేశాలనుండి దిగుమతి చేసుకుంటుందని అదే మన దేశంలో పండిస్తే మనకు నూనెలు సమృద్ధి తో పాటు విదేశీ మారక ద్రవ్యం వచ్చే అవకాశం ఉందన్నారు.
నరేంద్ర మోడీ ఓట్లు సీట్లు పెంచుకోవడానికి పడే శ్రమ ప్రజల సమగ్ర అభివృద్దికి పడటం లేదని ఎద్దేవా చేసారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు పండించే పంటకు భరోసా కల్పించిన పప్పు డే రైతు ధైర్యంగా ఉండి సాగు చేస్తారని తెలిపారు.ఫాం ఆయిల్ పంటకు భరోసా కల్పించాలని డిమాండ్ చేసారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ పామాయిల్ టన్ను గెలలు కు రూ.25 వేలు హామీ ధర ఇచ్చేలా కేంద్రం చట్టం చేయాలని డిమాండ్ చేసారు.పామాయిల్ సాగు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి నట్లు గానే తెలంగాణ పామాయిల్ రైతుసంఘం విస్తరించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు నున్నా నాగేశ్వరరావు మాట్లాడు దమ్మపేట మండలం అప్పారావు పేట లో నిర్మించిన రెండో ఫాం ఆయిల్ పరిశ్రమ 2014 లో తెలంగాణ రైతు సంఘం పోరాట ఫలితంగా ఇలానే నిర్మించ బడిందని గుర్తు చేసారు.తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ రైతులు ఐక్యంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఉద్ఘాటించారు. ముందుగా తెలంగాణా పామాయిల్ రైతు సంఘం ప్రాముఖ్యతను,ప్రాధాన్యతను,దాని ద్వారా సాగు దారులకు ఎలా ఉపయోగం అనే అంశాలు పై ఆయిల్ ఫాం గ్రోయర్స్ సొసైటీ అధ్యక్షులు తుంబూరు మహేశ్వర రెడ్డి సాగుదారులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయిల్ ఫాం చట్టం తో రూపొందిన సమాచార పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అద్యక్ష కార్యదర్శులు ఎలమంచిలి వంశీ క్రిష్ణ,అన్నవరం సత్యనారాయణ,అశ్వారావుపేట గ్రోయర్స్ సొసైటీ బాధ్యులు ఆళ్ళనాగేశ్వరరావు,భువనేశ్వరి రెడ్డి లు పాల్గొన్నారు.
Spread the love