
నవతెలంగాణ – అశ్వారావుపేట
మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు అనారోగ్యం కలిగి ఆపదలో పడ్డప్పుడు అత్యవసరంగా ప్రధమ చికిత్స అందించేది గ్రామాల్లో ఉండే ఆర్ఎంపీ, పీఎంపీ లేనని కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్ అన్నారు. టిఎస్ ఆర్ఎంపీ పీఎంపీ సీపీ ఈపీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివ గారి వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అద్యక్షులు ఎస్.జగదీష్ అద్యక్షతన ఆదివారం స్థానిక సూర్య పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాలెండర్ ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ వైద్యులకు పలు సూచనలు చేసారు. ఆర్ఎంపీ,పీఎంపీ లు లేకపోతే నేటికీ గ్రామాల్లో, అడవుల్లో వైద్యం అందక ప్రజలు అనేక ఇబ్బందులు పడతారు అన్నారు. అయితే ఎవరూ కూడా పరిమితికి మించి వైద్యం చెయ్యవద్దు అని, ప్రధమ చికిత్స చేసి మీ పరిధి దాటిన కేసులను ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించాలని తెలిపారు. జిల్లా అధ్యక్షులు జగదీష్ మాట్లాడుతూ గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు శిక్షణ ఇప్పించాలని,దృవీకరణ పత్రాలు,గుర్తింపు కార్డులు అందజేయాలని,ప్రభుత్వం నిర్వహించే వైద్యశిబిరాలలో,108,104 అత్యవసర సేవల్లో గ్రామీణ వైద్యులను భాగస్వాములను చేయాలని సీఎం రేవంత్ రెడ్డి,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహంకు ఈ సభ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశం లో జిల్లా కార్యదర్శి సతీష్,మండల గౌరవ అధ్యక్షులు ఎం.జీ శంకరరావు,అద్యక్షులు టి.క్రిష్ణ, ఉపాధ్యక్షులు ఐ.తాతారావు, గౌరవ సలహా దారులు పి.సత్యనారాయణ,మండల కార్యదర్శి ఎస్.కే వలీ,సంయుక్త కార్యదర్శి వి.సత్యనారాయణ,కోశాధికారి ఎస్.చంద్రశేఖర్,సంఘం బాధ్యులు కే.వెంకటేష్ రాజు,వి. ప్రసాద్,పి.ప్రసాద్,సీ.హెచ్ మోహన్ కృష్ణ,గోవిందా రాజులు,కే.రాము,జే.బాబురావు,పి.పుల్లారావు,వై.ప్రేమ సాగర్,ఎల్.నాగేంద్ర,శిలార్, లక్ష్మణ్ నాయక్,సుధాకర్,భగవాన్, రఫీ లు పాల్గొన్నారు.