
ప్రతి పేదవాడు సన్న బియ్యంతో కడుపు నిండా తినాలన్నదే ప్రజా ప్రభుత్వం లక్ష్యం కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో కలిసి సన్నబియ్యంతో చేసిన భోజనా న్ని చేశారు. కుటంబానికి చెందిన ఆ తల్లి మాట్లా డుతూ ఎన్నో ప్రభుత్వలను చూసాను కానీ నేటి ప్రజా ప్రభుత్వం మా పేదవారి గురించి ఆలోచించి సన్నబియ్యం పథకం తేవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పోయి మీద సన్నబియ్యం, పోయి కింద రూ. 500 సబ్సిడీ సిలెండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఉచిత బస్ ప్రయాణం ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. నాడు, నేడు నిరుపేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి మేము ఎల్లవేళలా తోడు ఉంటామని చెప్పారు. అనంతరం ఆ పేద తల్లికి చిరు కానుకగా చీర పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి, మాజీ ఎంపీపీలు గాంధారి లత నరేందర్ రెడ్డి, గంట రవీందర్, మండ ల పార్టీ ఉపాధ్యక్షులు బెజ్జనబోయిన అనిల్, సీని యర్ నాయకులు పాగల కొండల్ రెడ్డి, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, సిద్ది శ్రీనాకర్ రెడ్డి, పంది రాజు, ఓల పు నారాయణ, దేవునూరి పోచయ్య, ఎన్నం భూపాల్ రెడ్డి, బషీర్, జీడిపల్లి స్వామి, ఆన్సర్, యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్, ప్రశాంత్ సాజిద్ తదితరులు పాల్గొన్నారు.