ప్రతి ఒక్క విద్యార్థీ యూనీఫామ్ ధరించాలి: హెచ్ఎం హన్మంత్ రెడ్డి

నవతెలంగాణ – జుక్కల్
ప్రతి ఒక్క విద్యార్థి ప్రభూత్వం సర్ఫారా చేస్తున్న యూనీఫాం ను ఖచ్చితంగా దరించి పాఠశాలలకు రావాలని జుక్కల్ జిల్లా పరిషత్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు హన్మంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన యూనీఫాం ల పంపిణి కార్యక్రమంలో  జుక్కల్ ఎంపీడీవఓ శ్రీనీవాస్, ఐకేపీ ఎపీఎం సత్యనారాయణ  ముఖ్య అథితితులుగా  పాల్గోన్నారు. ఈ సంధర్భంగా విద్యార్థిని విద్యార్థులకు ఐకేపీ ఆధ్వర్యంలో కుట్టిన వాటిని యూనీఫాం లను ముఖ్యఅథితుల చేతుల మీదుగా పంపిణి చేసారు. మంచిగా చదివి తల్లిదండ్రుల గౌరవ మర్యాదాలు పెంపోందిస్తే పాఠళాలకు కూడా మంచి గుర్తింపు వస్తుందని విద్యార్థులకు హెచ్ఎం హన్మంత్ రెడ్జి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఐకేపీ ఎపీఎం, జడ్పీహెచ్ఎస్ జుక్కల్ హెచ్ఎం, ఉపాద్యాయబృందం, సీసీలు  తదితరులు  పాల్గోన్నారు.

Spread the love