స్పీకర్ ప్రసాద్‌కుమార్ రాష్ట్రాభివృద్ధికి సర్కారు కృషి: గుత్తా
ప్రభుత్వ నిధులు లేకున్నా అభివృద్ధి:శ్రీధర్‌బాబు
అసెంబ్లీ, ఈక్విప్, సీడీఎస్ మధ్య ఒప్పందం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంతో పాటుగా ప్రయివేటు రంగం, పౌర సమాజం, విద్యా సంస్థలు, దాతలు, ఎన్‌జీవో, సీఎస్‌ఆర్ నిధులను సమీకరించి వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో విప్లవాత్మకమైన ఫలితాలను సాదించవచ్చని అన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సచివాలయం, ఈక్విప్ సంస్థల మద్య బుధవారం కుదుర్చుకున్న ఎంవోయూ మంచి పరిణామమని అన్నారు. నూతన ఆవిష్కరణలు, సహకారం, పౌర భాగస్వామ్యం ద్వారా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో అభివృద్ధికి ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నానని వ్యాఖ్యానించారు. తెలంగాణ శాసనసభ సచివాలయం- ఈక్విప్ సంస్థ మధ్య ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో స్థానిక శాసనసభ్యుల సహకారం, సలహాలతో నైపుణ్యాభివృద్ధికి విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారత, డిజిటల్, సమ్మిళీతం, సుస్థిర జీవనోపాది, ఆర్ధిక పరిపుష్టి వంటి రంగాలలో ఈక్విప్ సంస్థ క్షేత్ర స్థాయిలో పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున్న అమలు చేస్తున్నారని చెప్పారు.
ఇలాంటి సందర్భంలో, రాష్ట్ర శాసనసభ సచివాలయం మార్గదర్శకంలో- ఈక్విప్ సంస్థ ఆద్వర్యంలో రాష్ట్రం లోని అన్నీ శాసనసభ నియోజకవర్గాలలో చేపట్టబోయే పనులన్ని కూడా పారదర్శకంగా, ప్రజలకు ఉపయోగపడేలా ఉంటాయన్నారు. ఈ ప్రయత్నానికి నా వంతుగా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాను. శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ప్రజల సంక్షేమం కోసం సరికొత్తగా ఈక్విప్, సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థతో ఎంవోయూ జరగడం శుభపరిణామమని వివరించారు. ప్రస్తుత రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయనీ, చట్టాలు తయారు చేసే ఎమ్మెల్యేలు నేడు నియోజకవర్గ స్థాయిలో అన్ని పనులు చేసే బాధ్యుడుగా గా మారారని గుర్తు చేశారు. ఏ చిన్న సమస్య ఉన్న స్థానిక ఎమ్మెల్యే పైన ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందని వివరించారు.
ప్రభుత్వ , ప్రయివేటు సంస్థల భాగస్వామ్యంతో నియోజలవర్గాల అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. ఈక్విప్ సంస్థ తీసుకువచ్చిన నియోజకవర్గాల అభివృద్ధి మార్పు అనే కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆశిస్తున్నామన్నారు. ఎంవోయూ చారిత్రాత్మక ఘట్టం అవుతుందని గర్విస్తున్నామని తెలిపారు.ప్రభుత్వ నిధుల అవసరం లేకుండా నియోజకవర్గాల వారిగా అభివృద్ధికి ఒక వేదికగా ఈక్విప్ సంస్థ నూతన ఆలోచనతో ముందుకు రావడం సంతోషమని ఐటీ, శాసనసభావ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు అన్నారు. ఇలాంటి నూతన ఆలోచనలతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులను గుర్తించడంతో పాటుగా, స్థానికంగా ఉన్న అవకాశాలను, వనరులను పారిశ్రామిక స్థాయిలో అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించడంతో పాటుగా ఆర్ధిక స్థిరత్వాన్ని పెంపొందించవచ్చని వివరించారు. నియోజకవర్గాల వారిగా రూట్ మ్యాప్ రూపొందించుకుని పనిచేయడం ద్వారా రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సచివాలయం, ఈక్విప్ ,సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం జరగడం మంచి పరిణామమని తెలిపారు. శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ చైర్మెన్ బండా ప్రకాష్ కౌన్సిల్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు, అసెంబ్లీ సెక్రటరీ రేండ్ల తిరుపతి, ఈక్విప్ డైరెక్టర్ శ్రీమతి వింద్యా ధర్మరాజు, ఈక్విప్ ఫౌండర్ లక్ష్మీనారాయణ, ఐ ల్యాబ్స్ చైర్మెన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



