
నవతెలంగాణ – వేములవాడ రూరల్
ఈ నెల 13 న జరుగు పార్లమెంట్ ఎన్నికలు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరు ఎన్నికల నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శుక్రవారం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టెంల గ్రామంలోని ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా సాగడానికి క్రింద తెలిపిన నిబంధనలు పాటించాలని తెలిపారు. శనివారం సాయంత్రం 06 గంటల నుండి 144 సెక్షన్ అమలులో ఉంటుంది కావున పోలింగ్ పోలింగ్ స్టేషన్ ల సమీపంలో ప్రజలు ఎవరు కూడా గుమికూడకూడదు అని అన్నారు.ఓటు హక్కు వినియోగించుకున్న వారు అనవసరంగా పోలింగ్ స్టేషన్ ల వద్ద తిరుగుతూ కనిపిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు.పోలింగ్ స్టేషన్ కి 100 మీటర్ల పరిధిలో ఎవరు కూడా గుమి కూడకూడదు,పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్ తీసుకపోకూడదని తెలియజేశారు. అభ్యర్థులు 200 మీటర్ల వరకు మాత్రమే వాహనాలు తీసుకపోవచ్చు,సోషల్ మీడియా వేదికగా విద్వేషాపూరిత ,రెచ్చగొట్టే సందేశాలు పంపుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. రేపటి నుండి సైలెంట్ పీరియడ్ మొదలవుతుంది కావున రాజకీయ పార్టీలకు చెందిన జెండాలు, గుర్తులు, ప్లకార్డులు ధరించొద్దని, ప్రదర్శించొద్దని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున పై నిబంధనలు ఉల్లగించిన వారిపై చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందిని అన్నారు.