లోక్ సభ ఎన్నికలకు సర్వం సిద్ధం

నవతెలంగాణ – రాయపోల్
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ సాధారణ ఎన్నికలు ఈనెల 13 వ తేదీన సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా యంత్రాంగం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త పాత ఓటర్ల తొలగింపులు మార్పులు చేర్పులు సవరణలు చేసి తుది ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు. రాయపోల్ మండలంలో 19 గ్రామ పంచాయతీలు 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాలలో 10,777 మంది మహిళలు, 10,383 మంది పురుషులు  మొత్తం 21,160 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉండగా రాయపోల్ మండలంలో వడ్డేపల్లి, అనాజిపూర్, ఎల్కల్, తిమ్మక్ పల్లి వంటి సమస్యాత్మక గ్రామాలలో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఐదుగురు పోలింగ్ అధికారులు చొప్పున మొత్తం 160 మంది పోలింగ్ అధికారులు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. ఇందుకోసం సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి, పోలీస్ కమిషనర్ అనురాధ ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాలు సందర్శించారు. ఎప్పటికప్పుడు సమస్యలపై ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు మద్యం డబ్బులు పంపిణీ కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమాలను పటిష్టంగా అమలు చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శాంతిభద్రతలకు భంగం కలవకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Spread the love