Saturday, June 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిద్యార్థులకు వేసవి సెలవులు పొడిగింపు..!

విద్యార్థులకు వేసవి సెలవులు పొడిగింపు..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలోని స్కూళ్లు జూన్‌ 12న పునః ప్రారంభం కానున్నాయి. అయితే భారీగా నమోదు అవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా విద్యార్థులకు సెలవులు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థుల ఆరోగ్యం విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. జూన్‌ 12 శుక్రవారం వస్తుంది. 13న శనివారం, 14 ఆదివారం కావడంతో ఈ రెండు రోజుల్లో విద్యార్థులు పాఠశాలలకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అందుకే 15 నుంచి స్కూళ్లు ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -