Wednesday, June 24, 2026
E-PAPER
Homeజాతీయంఫడ్నవీస్ డర్టీ పాలిటిక్స్ పై దృష్టి పెట్టారు: ఆతిథ్య ఠాక్రే

ఫడ్నవీస్ డర్టీ పాలిటిక్స్ పై దృష్టి పెట్టారు: ఆతిథ్య ఠాక్రే

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఫడ్నవీస్ పాలనపై కాకుండా డర్టీ పాలిటిక్స్ పై దృష్టి పెట్టారని శివసేన(యూబీటీ) ఆతిథ్య ఠాక్రే అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ముంబాయి వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలకు డ్రైయినేజీ వాటర్ నిలిచిపోతుందని, ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లలో, ఈ బీజేపీ ప్రభుత్వం BMC (Brihanmumbai Municipal Corporation)నిధులను ఖాళీ చేసింది తప్ప, ఒక్క వర్షపు నీటి నిల్వ ట్యాంకును కూడా నిర్మించలేదని ఆయన ఆరోపించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు ఎదురయ్యే పరిస్థితులను తట్టుకునేలా రాష్ట్రంలోని నగరాలను సిద్ధం చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని ఠాక్రే ఆరోపించారు. వారు డీశాలినేషన్ (సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే) ​​ప్రాజెక్ట్‌ను కూడా ముందుకు తీసుకెళ్లలేదు, ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారని, అంటే సాంకేతికంగా చూస్తే, భారీ వర్షాల సమయంలో ఎదురయ్యే పరిస్థితులను బీజేపీ ప్రభుత్వం ముందస్తు అంచనా వేయలేదు. తక్కువ వర్షపాతం ఉన్నప్పుడు అవసరమైన స్వయం సమృద్ధిని కూడా కల్పించలేదని ఆయన మండిపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -