నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో మ్యాచ్‌ల నిర్వహణ ఉత్సాహంగా సాగుతుండగా, మరోవైపు కొందరు కేటుగాళ్లు టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. లక్నోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో నకిలీ ఐపీఎల్ టికెట్లు తయారు చేసి అమ్ముతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మధ్య గురువారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకనా స్టేడియం సమీపంలో నకిలీ టికెట్లు అమ్ముతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్నో సౌత్ డీసీపీ అమిత్ కుమార్ ఆనంద్ మాట్లాడుతూ.. నిందితులు ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాకు చెందిన వారని తెలిపారు.
ఐపీఎల్ మ్యాచ్‌లకు ఏఐతో ఫేక్ టికెట్లు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



