నిరాశ జనకంగా టమాట సాగు, ఆందోళనలో రైతన్నలు..

 

నవతెలంగాణ- రెంజల్

రెంజల్ మండలంలోని పేపర్ మిల్ గ్రామానికి చెందిన అరుణ్ ఖాన్ తన ఐదు ఎకరాలలో టమాట సాగు చేయగా మార్కెట్లో ధరలు పడిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో సుమారు 500 ఎకరాల రైతులు టమాటా సాగుతో పాటు వివిధ కూరగాయలు ఆకుకూరలను పండించగా, నేడు మార్కెట్లో టమాట ధర గణనీయంగా పడిపోవడంతో పెట్టిన పెట్టుబడులు సైతం రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పంట సాగు కు సుమారుగా లక్ష 50 వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో నష్టం వాటిల్లుతుందని వారన్నారు. నేడు మార్కెట్లో టమోటా ధర 10 నుంచి 20 రూపాయలు పలకడంతో కూలీలు, వాహనం రవాణా ఖర్చులకే సరిపోతుందన్నారు. మిశ్రమ పంటలు ఆకుకూరలు వేయక వాటి ద్వారా కొంత ఉపశమనం కలిగిందని ఆయన అన్నారు.
Spread the love