రైతులు తప్పనిసరిగా రసీదు పొందాలి: ఏడిఏ మల్లయ్య

నవతెలంగాణ – మోర్తాడ్
రైతులు విత్తన దుకాణాలలో విత్తనాలు స్వీకరించేటప్పుడు తప్పనిసరిగా సంబంధిత దుకాణాలలో రసీదు తీసుకోవాలని భీంగల్ ఏ డి ఏ మల్లయ్య అన్నారు. మండల కేంద్రంలోని ప్రవేట్ వ్యవసాయ విత్తన కొనుగోలు దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. విత్తనాలు కొనుగోలు చేసే రైతు పేరుతో పాటు తండ్రి పేరును తప్పనిసరిగా నమోదు చేయాలని, కొనుగోలు చేసిన రైతు వివరాలను పూర్తిగా సంబంధిత డీలర్ వద్ద భద్రంగా ఉండాలని అన్నారు. లేబుల్ లేని విత్తనాలను రైతుల కొనుగోలు చేయకూడదని, విత్తనాలు కొనుగోలు చేసే రైతులు తప్పనిసరిగా కంపెనీ వివరాలను చూడాలని అన్నారు. ప్రతి డీలర్ తప్పనిసరి స్టాప్ వివరాలను షాపు వద్ద ప్రచురణ చేయాలని సూచించారు. మండలంలో ఉన్న అన్ని విత్తన డీలర్లను మండల అధికారితో పాటు ఏఈవోలు రోజువారిగా తనిఖీలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

Spread the love