
గత రెండు రోజుల క్రితం అకాల వర్షానికి అతలాకుతలమైన మండలంలోని ఏజెన్సీ చిరు వ్యాపారులు, రైతుల ను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బిజెపి మండల అధ్యక్షులు తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం మండలం కేంద్రంలో బిజెపి శ్రేయాలతో కలిసివచ్చి నూతనంగా వచ్చిన తాసిల్దార్ సురేష్ బాబు ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు. సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ మూడు రోజులక్రితం మండలం లో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను మరియు ఇంటి పై కప్పులు లేచిపోయి ఇబందులు పడుతున్న వారిని మానవతా దృక్పధం తో ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి సహాయాన్ని తక్షణమే అందించాలన్నారు. అనంతరం మండలంలోని రెవెన్యూ సమస్యలపై మాట్లాడారు.ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి భర్తపురం నరేష్, జిల్లా కౌన్సిల్ మెంబెర్ డ్యాగాలా సేలందర్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జంగా హన్మాంతరెడ్డి, నాయకులు చెంగల సుభాష్, అలకుంట చిన్న, ఆళ్ల నవీన్,రఘు,మెడిశెట్టి పురుషోత్తం జీడి ప్రశాంత్, వెంకన్న దిలీప్ సేనాపతి పాల్గోన్నారు.