వరి కోత సమయంలో రైతులు జాగ్రత్తలు పాటించాలి: ఎఇఓ అక్రమ్

నవతెలంగాణ జన్నారం.
యాసంగి వరి కోత సమయంలో రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని, మండలంలోనికవ్వాల్ సెక్టార్ ఎఇఓ అక్రమ్ అన్నారు. బుధవారం కవ్వాల్ సెక్టార్ పరిధిలోని రైతుల  పంట పొలాలకు వెళ్లి పంట కోత పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  హర్వెస్టర్ ఫ్యాన్ స్పీడ్ 18 నుండి 19 ఆర్ పి ఎం ఉండేలా చూడాలని హార్వెస్టర్ డ్రైవర్లకు, రైతులకు సూచించారు.  పరిపక్వమైన వరి పంటను కోయాలని ముందే పక్వం కానీ వరి పంటను కోయటం వలన తాలు తప్ప అధికంగా వచ్చి కొనుగులు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతారన్నారు. అలాగే వడ్లను తమ పొలాల వద్ద ఆరబెట్టి తాలు తప్ప లేకుండా ఆరబెట్టి 17 శాతం కంటే తక్కువ తేమ శాతం ఉన్న ఎఫ్ఏక్యు వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు తేజవాత్ రమేష్, జునుగురి రాజన్న, కామెర బక్కన్న, హర్వెస్టర్ డ్రైవర్లు సత్తన్న తదితరులు పాల్గొన్నారు
Spread the love