- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ముంబై కోస్టల్ రోడ్డుపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఇథనాల్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. ట్యాంకర్‌లో ఇథనాల్ ఉండటంతో అగ్నిప్రమాదం జరగకుండా అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



