Tuesday, July 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమేఘాద్రి రిజర్వాయర్‌ లో స్నానానికి దిగి విద్యార్థులు మృతి

మేఘాద్రి రిజర్వాయర్‌ లో స్నానానికి దిగి విద్యార్థులు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రిజర్వాయర్‌లో స్నానానికి దిగిన ఇంటర్ విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన విశాఖ జిల్లా చింతగట్ల సమీపంలోని మేఘాద్రి రిజర్వాయర్‌ వద్ద చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఆదివారం రిజర్వాయర్‌కు వెళ్లారు. ఈ క్రమంలో స్నానానికి దిగి ఇద్దరు గల్లంతయ్యారు. తోటి విద్యార్థుల సమాచారంతో గజఈతగాళ్లు గాలింపు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు దీపక్ (17), రామచంద్రరావు (18)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -