బదిలీల భయం.. ఏసీబీ గుబులు

– స్థానికంగా ఉండని అధికారులు, ఉద్యోగులు..
నవతెలంగాణ – వేములవాడ 
ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు ఏప్రిల్ 23న వేములవాడ రాజన్నను దర్శించుకొని, తిప్పాపూర్ లోని గోశాలను పర్యవేక్షించారు.. గోశాలలో ఉన్న ఆవులు, కోడెలు బక్క చిక్కే ఉన్న మూగజీవాలన చూసి చెల్లించి పోయిన కమిషనర్ దేవాలయ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. రెండు రోజుల్లోనే రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ మంజు వాణి పర్యవేక్షణలో కోడెళ్లకు వైద్య పరీక్షలు, వ్యాక్సినేషన్ నిర్వహించారు. రాజన్న కోడెల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నూతన కమిషనర్ రాకతో దేవాలయంలో అవినీతి ఉద్యోగులపై చర్యలు తీసుకొని, ఆలయంలో బదిలీలు తప్పవని అందరూ అనుకున్నారు.. కానీ ఈలోపే పార్లమెంట్ ఎన్నికలు రావడం బదిలీలు అనే అంశానికి బ్రేక్ పడినట్లు అయ్యింది. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ లు బదిలీలు జరగడంతో రాష్ట్రంలోని దేవాలయంలో సైతం అతి త్వరలోనే బదిలీలకు రంగం సిద్ధం అన్నట్లుగా దేవాలయ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అంతా వారి ఇష్టం. వారిని అడిగే వారు ఎవరన్నట్లుగా దేవాలయంలో అధికారులు, ఉద్యోగులు రూల్స్ బ్రేక్ చేస్తూ విధుల పట్ల అలసత్వం కొట్టొచ్చినట్లుగా గోశాల నిర్వహణలోని ఎండోమెంట్ కమిషనర్ కు అర్థమయ్యే ఉంటుందని,  ఉద్యోగుల ముఖ్య శాఖలో పనిచేస్తున్న ఏ ఈ ఓ లు, సూపర్డెంట్లు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ల బ్యాంక్ బ్యాలెన్స్,  విశాలమైన భవనాలు, ఫ్లాట్స్, ఖరీదైన వాహనాలు ఇలా చెప్పుకుంటే పోతే వీరి అవినీతి బాగోతం, అక్రమార్జన, నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో పదోన్నతులు, ఏ ఈ ఓ లు దీర్ఘకాలికంగా ఒకే శాఖలో వీధుల పై నవతెలంగాణ దినపత్రికలో ప్రత్యేక వరుస కథనాలు ప్రచరితమయ్యాయి. ఇక్కడే పోస్టింగ్.. ఇక్కడే ఉద్యోగ విరమణ.. గతంలో విజిలెన్స్ దాడుల్లో 14 మంది అవినీతి అధికారుల చిట్టా రాజన్న దేవాలయ ఇన్చార్జి ఈవో రామకృష్ణ ఎంక్వైరీ అధికారిగా విచారణ జరిపి నోటీసులు జారీ చేశారు. నవతెలంగాణ కథనాలతో రాజన్న దేవాలయ క్షేత్రంపై దేవాదాయ – ధర్మాదాయ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ, టాస్క్ ఫోర్స్, రెవెన్యూ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి చాలించినట్లు, ఎప్పుడైనా దాడులు చేయవచ్చని విశ్వసనీయ సమాచారం. అవినీతి, అక్రమార్జన పాల్పడిన ఉద్యోగుల్లో, బదిలీల భయం  ఏసీబీ గుబులు పట్టుకుందని రాజన్న భక్తులు, పట్టణ పరిధిలో చర్చ జరుగుతుంది.
స్థానికంగా ఉండని ఉద్యోగులు:
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజన్న క్షేత్రం..  సుధీర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించడానికి అధికారులు, ఉద్యోగులు స్థానికంగానే ఉండి సేవలందించాలని నియమం ఉంది..పార్వతిపురంలోని నివాస గదులను  ఉద్యోగులకు కేటాయించారు. ఇద్దరు ఏఈవోలు, కొంతమంది సూపర్డెంట్లు కరీంనగర్ లో నివాసం ఉంటూ, వారికి ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. వారు వచ్చింది, పోయింది కూడా ఎవరికి తెలియదు. వారి కింది స్థాయి సిబ్బంది అంతా చూసుకుంటూ చక్కబెడతారు, దేవాలయానికి ఎవరైనా ముఖ్య అధికారి, ప్రజా ప్రతినిధి వస్తే మాత్రం ఆరోజు అందరూ సమయపాలన పాటిస్తూ కనిపిస్తారు. మిగతా రోజులు అంతా సారా మామూలే అన్నట్లుగా వివరిస్తారు, దేవాలయంలో క్రమశిక్షణ, పూర్తిస్థాయిలో ఉద్యోగులపై పటిష్టమైన పర్యవేక్షణ కొరవడింది.
దేవాలయంపై మంత్రి ప్రత్యేక దృష్టి..
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల ఉన్నత స్థాయి అధికారులతో కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో సమీక్ష నిర్వహించారు.  దేవాలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సేవలు, అవినీతి ఉద్యోగుల చిట్ట తదితర అంశాలపై చర్చలు జరిగినప్పటి నుండి ఉద్యోగుల్లో భయం నేలకుంది. దేవాదాయ శాఖ అధికారులకు మంత్రి ఆదేశించడంతో అక్రమార్జన పాల్పడిన, అవినీతి ఆరోపణలు ,ఒకే చోట దీర్ఘకాలికంగా విధులు నిర్వర్తిస్తున్న వారిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్  జాబితా తయారు చేసింది. జాబితా మేరకు ఏసీబీ దేవాలయ ఉద్యోగులపై నిఘా పెట్టినట్లుగా విశ్వసనీయ సమాచారం.  స్థానికంగా బదిలీ జరగకుండా, అవినీతి బయటపడకుండా వారిని కాపాడే వారికోసం, పైరవులకు మార్గాలను వెతుకుతున్నట్లుగా దేవాలయంలో కిందిస్థాయి ఉద్యోగుల్లో చర్చ జరుగుతుంది.
Spread the love