
2024 డీఎస్సి ఉపాధ్యాయ నియామకలో ఫేక్ సర్టిఫికెట్స్ లతో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులను వెంటనే తొలగించాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాలో రివెరిఫికేషన్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరగాలని తెలంగాణ సామాజిక విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంబ్లె ప్రజ్ఞశీల్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ బోనాఫైడ్ ఇచ్చిన ప్రవేటు పాఠశాల ఉట్నూర్ సన్ సైన్ స్కూల్ ప్రిన్సిపల్ షబీర్ పై క్రిమినల్, చీటింగ్ కేసులు నమోదు చేసి పాఠశాల గుర్తిపు రద్దు చేయాలన్నారు. సర్టిఫికెట్స్ పరిశీలనలో ఆలసత్వం వహించిన అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలిన్నారు. గుర్తింపు లేని కాలేజీల ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన పీఈటీ, పిడీలను తొలగించాలన్నారు. నకిలీ సర్టిఫికెట్స్ లతో ఉద్యోగాలు పొందినట్టు ప్రభుత్వ ఇంటలిజెన్స్ విభాగం గుర్తించడం జరిగిందని ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఫేక్ ఉద్యోగస్తుల లిస్టును ప్రభుత్వం బహిర్గతం చేయాలన్నారు. ఫేక్ సర్టిఫికెట్ తో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులను తొలగించి తర్వాత ర్యాంక్ వచ్చిన అభ్యర్థులతో ఉద్యోగాలు భర్తీ చెయ్యాలన్నారు. డీ ఈ ఓను విధుల నుంచి తొలగించాలని లేని పక్షంలో దళిత ఆదివాసీ విద్యార్ధి సంఘాలు, నిరుద్యోగులు, అభ్యర్థులతో కలిసి తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంల ఆదివాసీ విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిడాం జంగుదేవ్ పటేల్, టీఎస్ఏస్ఓ జిల్లా అధ్యక్షులు జాడి వెంకటేష్ నేత, ఆదివాసీ విద్యార్ధి సంఘం జిల్లా ఇంచార్జి మంగం దీపక్ కుమార్, నాయకులు ఆత్రం ఉపేంద్ర, కోటేష్, తుకారాం, మోతిరం పాల్గొన్నారు.