Thursday, July 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్నూరు కాపు కాచిగూడ మహాసభ అధ్యక్షునికి సన్మానం 

మున్నూరు కాపు కాచిగూడ మహాసభ అధ్యక్షునికి సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండల కేంద్రానికి గురువారం హైదరాబాద్ మున్నూరు కాపు కాచిగూడ మహాసభ అధ్యక్షులు గంప చంద్రమోహన్ ను శాలువాతో సన్మానించి జ్ఞాపికను మున్నూరు కాపు మండల అధ్యక్షులు కడెం శ్రీకాంత్, స్థానిక సర్పంచ్ బండి ప్రవీణ్ అందజేశారు. అంతకుముందు శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మునక్కాపు సంఘ భవనానికి జిల్లా కన్వీనర్ కొమ్ము శ్రీనివాస్ రూ.25000/- అధ్యక్షులు గంప చంద్రమోహన్ ప్రతి మండల సంఘానికి రూ 10,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రెడ్డి గారి అంజయ్య, మండల ప్రధాన కార్యదర్శి కాల హనుమాన్లు, మహాసభ పట్టణ సభ్యులు తోట భూమయ్య, మున్నూరు కాపు సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -