Thursday, July 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధిస్తాం 

ప్రతి పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధిస్తాం 

- Advertisement -

జిల్లా విద్యాధికారి వెంకట్
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్ 

మండలంలోని బురుగుపల్లి గ్రామంలో గురువారం రోజున జిల్లా విద్యాధికారి వెంకట్ రికార్డులను తనిఖీ చేశారుఅన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో విద్యార్థులు చదవడం రాయడంలో చాలా నైపుణ్యత కలిగి ఉన్నారని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరుగుతుందని ఈ సంవత్సరం 10వ తరగతి100 శాతం ఫలితాలు వచ్చిన అనేక ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని రానున్న రోజుల్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 100% ఉత్తీర్ణత వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని ప్రభుత్వ పాఠశాలలో అన్ని హంగులాలతో కూడిన సదుపాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు.పాఠశాల రికార్డులో తనిఖీ చేసి ఎప్పటి సమాచారం అప్పుడే రికార్డులు నమోదు చేయాలని ఉపాధ్యాయులను సూచించారు. కొంతమంది విద్యార్థులకు పుస్తకాలను చదివించారు భోజన విధానం ఎలా ఉందని తెలుసుకున్నారు.అనంతరం పాఠశాల తరగతి గదులను, వంట గది ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలన్నారు అదేవిధంగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రవీణ్ కుమార్,కాంప్లెక్స్ హెచ్ఎం వల్లభ రావు, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -