వ్యవసాయ విద్యార్ధుల క్షేత్ర సందర్శన..

నవతెలంగాణ – అశ్వారావుపేట
వ్యవసాయ కళాశాల రెండవ సంవత్సర విద్యార్థులు గురువారం అశ్వారావుపేట లో గల పామ్ ఆయిల్  ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ని క్షేత్ర సందర్శన చేసారు. కంపెనీ ఇంచార్జి నాగరాజు ఈ సంస్థ యొక్క ప్రాముఖ్యతని, సంస్థాగతంగా నిర్మాణాన్ని, పని చేసే విధానాలను వివరించారు. సంస్థ లోని  సంఘటిత శక్తి  రైతు ను లాభాల బాట పట్టిస్తోందని ఆయన అభిప్రాయ పడ్డారు. వ్యవసాయ పద్ధతులు నుండి క్రయవిక్రయాలు వరకు ఈ సంస్థ తమ వాటా దారులకు ఎలాంటి సేవలు అందిస్తుంది అనే విషయాన్ని వివరించారు. ఒక సాధారణ సన్నకారు లేక చిన్నకారు రైతు ఈ సంస్థ లో చేరడం వల్ల ఎంతగానో అభివృద్ధి చెంది గలరని ఆయన అభిప్రాయ పడ్డారు. వ్యవసాయ ఆర్ధిక శాస్త్రం సహాయ ఆచార్య డాక్టర్ కృష్ణ తేజ, వ్యవసాయ విస్తరణ సహాయ ఆచార్యులు డాక్టర్ శ్రావణ్ కుమార్ ఈ సందర్శన ను సమన్వయపరిచారు.
Spread the love