వ్యవసాయ విద్యార్థుల క్షేత్ర సందర్శన

నవతెలంగాణ – అశ్వారావుపేట
వ్యవసాయ ఆధారిత అనుబంధ యూనిట్ల సందర్శనలో బాగంగా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు చెందిన సెకండ్ ఇయర్ విద్యార్థులు బుధవారం క్షేత్ర సందర్శనలో భాగంగా ఖమ్మం జిల్లా కల్లూరు, గంగారం లో పర్యటించారు. ముందుగా కల్లూరు షుగర్ ఫ్యాక్టరీ ని సందర్శించారు. అక్కడ చక్కెర తయారీ,ఉప ఉత్పత్తులు,ముడి సరుకు, ప్రాసెసింగ్ విధానాన్ని ఫ్యాక్టరీ ఎంప్లాయ్ కన్నా రావు విద్యార్థులకు వివరించారు. ఉప ఉత్పత్తుల సేకరణ, వాటిని తిరిగి వినియోగించు పద్ధతులపై అవగాహన కల్పించారు.అక్కడ నుండి సత్తుపల్లి మండలం గంగారం కేశవా సీడ్స్ సందర్శించారు. కంపెనీలో జరిగే వీర్ ప్రాసెసింగ్ పద్ధతి,నాణ్యమైన విత్తనం తయారీ,ప్యాకింగ్,యంత్రాల పనితీరును వివరించారు. విద్యార్థుల క్షేత్ర సందర్శన తోనే నైపుణ్యం పెంపొందించు ఋకోవటం సులభంగా ఉంటుందని కళాశాల శాస్త్రవేత్తలు శిరీష, అస్లామ్,కుమారి చరిత తెలిపారు.  కార్యక్రమంలో సీఈవో ఆశాజ్యోతి ఉన్నారు.
Spread the love