25న నల్లవెల్లి గ్రామంలో రాత్రిపూట ఫైలేరియా రక్త పూతల నమూనా కార్యక్రమం..

– విజయవంతం చేయాలని పిలుపు..
– ఇంచార్జీ డిప్యూటీ సిఎం హెచ్ ఓ తుకారాం రాథోడ్..
నవతెలంగాణ – డిచ్ పల్లి

ఈనెల 25 న ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలో రాత్రిపూట ఫైలేరియా రక్త పూతల నమూనా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇన్చార్జి జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ పేర్కొన్నారు. సోమవారం ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఇన్చార్జి జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు.మండలం లోని చాంద్రాయన్ పల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాన్ని పరిశీలించారు. గన్నారంలో పూర్తయిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని పరిశీలించి ప్రహరీ గోడ అసంపూర్తిగా ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందల్ వాయి ప్రభుత్వ ఆసుపత్రి లో ఇన్ పేషెంట్లను పరిశీలించి తగిన చికిత్స అందించాలని స్టాఫ్ నర్స్ గంగమణి కి  సూచించారు. జాతీయ టీకా నివారణ కార్యక్రమంలో భాగంగా టీకాలు నిలువ చేయు గదిని మరియు రిఫ్రిజిరేటర్ లను పరిశీలించారు. జాతీయ ఫైలేరియా నివారణ కార్యక్రమంలో భాగంగా ఫైలేరియా రక్తపూతల నమూనా సేకరణ గురించి లాబ్ టెక్నీషియన్ అనితకు వివరించారు. 25న నల్లవెల్లి గ్రామంలో రాత్రిపూట ఫైలేరియా రక్త పూతల నమూనా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ కు ఆదేశించారు. ప్రతి ఒక్క ఉద్యోగి సరియైన ప్రొఫార్మా లోనే సెలవు పత్రం ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓ జేమ్స్ న్యూటన్,డి.పి.ఎం. ఓ.శ్రీనివాస్, ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్, ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్ అలీ, ఆరోగ్య కార్యకర్తలు, వెంకట్ రెడ్డి ఆనంద్,పాల్గొన్నారు.

Spread the love