విద్యుత్ శాఖలో ఖాలీ పోస్ట్ భర్తీ చేయండి..

– దరఖాస్తు చేసిన ఆయిల్ ఫాం గ్రోయర్స్ సొసైటీ కార్యదర్శి పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యుత్ శాఖ లో ఖాలీ పోస్ట్ లు భర్తీ చేస్తే సగం విద్యుత్ సమస్యలు పరిష్కారం అవుతాయని అందుకే ముందుగా మీ శాఖలో కాలీ పోస్టులు భర్తీ చేయాలని ఎన్.పి.డి.సి.ఎల్ ఆద్వర్యంలో సోమవారం నిర్వహించిన విద్యుత్ ప్రజావాణి లో ఏడీఈ వెంకటేశ్వర్లు కు తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ ఫాం గ్రోయర్స్ సొసైటీ కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య వినతి పత్రం అందజేసారు. వినతి పత్రంలో అంశం యధాతధంగా.ప్రజావాణి – విద్యుత్ సమస్యలు పరిష్కరించుటకు ఏర్పాటు  చేసిన సందర్భంగా,మీ పరిధిలో గల అశ్వారావుపేట, దమ్మపేట ఈ రెండు మండలాల్లో పామ్ ఆయిల్ రైతులు ఎదుర్కొంటున్న కరెంట్ లైన్లు సమస్యలు పరిష్కరించమని కోరడం గురించి.
అయ్యా .!
అశ్వారావుపేట,దమ్మపేట మండలాల్లో వేలాది ఎకరాల్లో గత అనేక సంవత్సరాలుగా పామ్ ఆయిల్ సాగు అవుతుంది.ప్రస్తుతం ఏపుగా పెరిగిన ఫాం ఆయిల్ చెట్లు వలన ఏళ్ళ నాడు నిర్మించిన విద్యుత్ లైన్ లు ఇపుడు ఆ చెట్లు కొమ్మలకు తగిలి కరెంట్ పోవడం, (ట్రాన్స్ ఫారాలు ట్రిప్ అవ్వటం,మోటార్లు కాలి పోవడం జరుగుతుంది.).ఈ  ఎల్.టి లైన్ లు లేదా ట్రాన్స్ ఫారాలు తరుచూ మరమ్మత్తులకు గురికావడంతో రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వీటి ప్రత్యామ్నాయంగా లైన్ లు మార్చి వేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి అని గతంలోనే అధికార్లకు తెలియజేసాం.ఉన్నంతలో అధికార్లు  సహకరించి నప్పటికీ ఇంకా సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. అశ్వారావుపేట, దమ్మపేట రెండు మండలాల పరిధిలోని రెండు సబ్ స్టేషన్ ల పరిధిలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. దాదాపు ఈ రెండు మండలాల పరిధిలో  100 మందికి పైగా సిబ్బంది కొరత ఉన్నదని తెలుస్తుంది. కాబట్టి మీ పై అధికార్లు ద్వారా ముందు మీ సిబ్బంది సమస్య పరిష్కరించుకుని ఈ మా రైతులు సమస్య‌లు పరిష్కరించాలని కోరుతున్నాము. విద్యుత్, ఉద్యాన, ఆయిల్ ఫెడ్ అధికారులు సంయుక్త కార్యాచరణ తోనే పామాయిల్ తోటల్లో ప్రస్తుతం ఉన్నటువంటి విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు జోక్యం చేసుకొని, భవిష్యత్తులో కొద్దిగా సాగు చేసే రైతులకు అవగాహన కల్పించి, కరెంట్ సమస్యలు ఎదురుకాకుండా చూడాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ప్రముఖ రైతు, సామాజిక హితులు దండు. రామరాజు లు ఉన్నారు.
Spread the love