భూమి బంగారం కంటే విలువైనది: సినీనటుడు మురళీమోహన్

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం రెడ్డిబావి భాను ప్రభ ఇన్ఫ్రా డెవలపర్ మొదటి వార్షికోత్సవ కార్యక్రమానికి మాజీ ఎంపీ మురళీమోహన్ విచ్చేసి బ్రోచర్ విడుదల చేశారు. ఆదివారం గోల్డెన్ లీఫ్ వార్షికోత్సవ కార్యక్రమానికి సినీ నిర్మాత మాజీ ఎంపీ మురళీ మోహన్ మాట్లాడుతూ.. మ్యూచువల్ ఫండ్, బంగారం కంటే భూమి విలువ 100 శాతం ఎక్కువ అని అన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై హెచ్ఎండిఏ పర్మిషన్ తో అత్యాధునిక సదుపాయలతో బంగారు ఆకు వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేస్తే మీరు కూడా బంగారం లాగ ఎదుగుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జీవి వరప్రసాద్ భాను ప్రభ డెవలపర్ చైర్మన్ వేణు పర్వతం అశోక్,సందీప్,జానీ తదితరులు పాల్గొన్నారు.
Spread the love