
ఉప్పునుంతల మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన తాళ్ల చెన్నయ్య (70) ఐదు రోజుల క్రితం మధ్య రాత్రి బ్రేన్ స్ట్రోక్ రావడంతో కాలు చెయ్యి స్పర్శ లేకపోవడంతో వైద్యం కోసం మహబూబ్ నగర్ ప్రైవేటు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరుగుతుండగా బుధవారం అర్ధరాత్రి చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ చనిపోయిన విషయం తెలుసుకున్న బీ ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొత్త రవీందర్ రావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి 5 వేల నగదు , 100 కేజీల బియ్యం ఆర్థిక సాయంగా ఇచ్చి కుటుంబానికి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.