ఒఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ కు రేడియల్‌ రోడ్లు సీఎం ఆదేశాలు

నవతెలంగాణ – హైదరాబాద్: అవుటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి ప్రాంతీయ రింగ్‌ రోడ్డుకు రేడియల్‌ రోడ్లకు ప్రణాళికలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో హెచ్‌ఎండీఏ, పురపాలక శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మాస్టర్‌ ప్లాన్‌ -2050కి అనుగుణంగా విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించాలని సూచించారు. ఓఆర్‌ఆర్‌ లోపల ప్రాంతాలను ఒకే యూనిట్‌గా అభివృద్ధి చేయాలన్నారు. ఓఆర్‌ఆర్‌ – ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య ప్రాంతాలను హెచ్‌ఎండీఏ పరిధిలోకి తేవాలని చెప్పారు.

Spread the love