నవతెలంగాణ హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ(Congress) అదే జోష్ తో లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. అందులో భాగంగా లోక్ సభ ఎన్నికలపై (Loksabha Elections) దృష్టి కేంద్రీకరించింది. లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వనిస్తోంది. ఆన్ లైన్‌లో అప్లికేషన్స్ ఫారాలు ఉంటాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఫీజు తీసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.25 వేలు, ఇతరులు రూ.50 వేలతో డీడీ తీయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో నేటి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. వచ్చేనెల 3వ తేదీ వరకు ఆప్లికేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది.