25న కాంగ్రెస్ తుది జాబితా!

కాంగ్రెస్ తుది జాబితా?
కాంగ్రెస్ తుది జాబితా?

నవతెలంగాణ హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితాపై స్క్రీనింగ్‌ కమిటీ కసరత్తు దాదాపు తుదిదశకు చేరినట్టు తెలుస్తోంది. వరుసగా రెండో రోజు కూడా ఢిల్లీలో సమావేశమైన స్క్రీనింగ్‌ కమిటీ అభ్యర్థుల ఎంపికపై విస్తృతంగా చర్చించింది. మొదటి జాబితాలో 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌.. మిగిలిన 64 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే 35 నుంచి 40 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులపై ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. ఈనెల 25న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. అదే రోజున కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Spread the love