మంత్రి దుద్దిళ్ల, స్పీకర్ లను కలిసిన మాజీ ఎంపిపి రవి

నవతెలంగాణ మల్హర్ రావు: తెలంగాణ ఐటీ, పరిశ్రమల, రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లను తెలంగాణ అసెంబీ ఆవరణలో మండల మాజీ ఎంపిపి ఇస్నపు రవి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మంత్రిగా దుద్దిళ్ల, స్పీకర్ గా గడ్డం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారిని రవి తన బృందంతో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలో ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Spread the love