అభిమానం చాటుకున్న ఆన్ సాన్ పల్లి సర్పంచ్ జగన్ నాయక్


– తోటి మిత్రునికి గిఫ్ట్ గా ద్విచక్రవాహనం
– మంత్రి దుద్దిళ్ల చేతులమీదుగా అందజేత
నవతెలంగాణ మల్హర్ రావు: తమ నాయకుడు దుద్దిళ్ల శ్రీదర్ బాబు కాంగ్రెస్ పార్టీ నుంచి మంథని ఎమ్మెల్యేగా ఐదోవసారిగా 30 వేల మెజార్టీతో గెలుపొందితే తోటి స్నేహితుడు మంథని మార్కెట్ కమిటి మాజీ ఛైర్మన్ అజిమ్ ఖాన్ కు రూ.80 వేలు విలువైన ద్విచక్రవాహనం గిఫ్ట్ ఇస్తానని మండలంలోని ఆన్ సాన్ పల్లి సర్పంచ్ గుగులోత్ జగన్ నాయక్ మాట ప్రకారం సోమవారం నూతన ద్విచక్రవాహనం కొనుగోలు చేసి రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల దుద్దిళ్ల మంత్రి శ్రీధర్ బాబు చేతులమీదుగా అందజేసీ అభిమానాన్ని చాటుకున్నాడు.అయితే నాలుగు నెలల క్రితం వీరిద్దరూ దుద్దిళ్లపై అభిమానంతో అనుకున్న దానిప్రకారం దుద్దిళ్ల 31 వెలు పై మెజార్టీతో గెలుపొందిన విషయం విదితమే. రాజీపడని రాజకీయ కార్మికుడు నిరంతరం శ్రీపాద ఆశయ సాధనకు కృషి చేసి వెలది మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న కాంగ్రెస్ పార్టీ హనుమంతుడు . మాజీ మార్కెట్ చైర్మన్ అజీమ్ ఖాన్ కు ద్విచక్ర వాహనం గిఫ్ట్ గా అదికూడా చేతుల మీదగా ఇవ్వడం అదృష్టంగా బావిస్తున్నానని ఈ సందర్భంగా జగన్ నాయక్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Spread the love