ప్రజావాణికి భారీ స్పందన

నవతెలంగాణ హైదరాబాద్‌: ప్రజాభవన్‌లో ప్రజావాణికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ఈ కార్యక్రమంలో  అర్జీలు సమర్పించేందుకు ముఖ్యంగా భూవివాదాలు, పింఛన్లకు సంబంధించిన సమస్యలపై అధికారులకు వినతులు ఇచ్చేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఈ కార్యక్రమానికి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Spread the love