అనారోగ్యంతో వృద్ధురాలు మృతి.. అంత్యక్రియలు నిర్వహించిన వందశాతం వికలాంగుడు

– తల్లి రుణం తీర్చుకున్ననని బావద్వేగానికి గురైన మల్క హరి
– పలువురిని ఆలోచింపజేసిన పరిస్థితి
నవతెలంగాణ మల్హర్ రావు: మండల కేంద్రమైన తాడిచెర్లలో మల్కా గోపమ్మ (90) అనే వృద్ధురాలు శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందింది. గోపమ్మ చిన్న కుమారుడు పుట్టుకతో వందశాతం వికాలంగుడైన హరిని ఏనాడు భారంగా బావించకుండా అన్ని తానై కంటికి రెప్పలా పెంచింది. తల్లి ఆకస్మిక మరణంతో వికలాంగుల పోరాట సమితి (విహెచ్ పిఎస్) ఉద్యమ నాయకుడు మల్కా హరి కన్నీటి పర్వంతమైయ్యాడు. తాను శిశువుగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు దాదాపు (50 ఏళ్ళు) తన తల్లి ఒక శిశువులాగే పెంచిందని బావద్వేగానికి గురై శనివారం తల్లి గోపమ్మను అంత్యక్రియలు నిర్వహించి రుణం తీర్చుకున్నట్లుగా తెలిపాడు. ఈ రోజుల్లో వందల కోట్లు,భూములు సంపాదించిన కుమారులు,కూతుళ్లు కొందరు తల్లిదండ్రులు మరణిస్తే కడసారి చూడడానికి రాని పరిస్థితుల్లో హరి కాళ్ళు,చేతులు లేక ఒక్కరి సహాయంతో వెళ్లే పరిస్థితులో ఉన్న అతడు అమ్మ అంత్యక్రియల్లో పాల్గొనడం పలువురిని ఆలోచింపజేసింది. లక్షల కోట్లు,భూములు సంపాదించిన సహారా సంస్థ యజమాని సుబ్రతో రాయ్ ఇటీవల చనిపోతే అతని ఇద్దరు కుమారులు అంత్యక్రియలకు హాజరు కానీ పరిస్థితి తెలిసిందే. అతని ఇద్దరు కుమారులు పెళ్లిళ్లకు ఏకంగా 500 కోట్లు ఖర్చు చేసిన విషయం విదితమే.. హరి తండ్రి రిటైర్డ్ ఉపాధ్యాయుడు కావడంతో అంత్యక్రియల్లో పలువురు ఉపాధ్యాయ సంఘాలు, వికలాంగుల సంఘాల నాయకులు పెద్దయెత్తున హాజరయ్యారు.

Spread the love