సాఫ్ట్ బాల్ భారత జట్టు కు ఎంపికైన క్రీడాకారినికి ఆర్థిక సహాయం

– సాఫ్ట్ బాల్ భారత జట్టు కు ఎంపికైన క్రీడాకారినికి ఆర్థిక సహాయం జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు ఉమాజీ నరేష్ 

నవతెలంగాణ-జక్రాన్ పల్లి 
సాఫ్ట్బాల్ భారత జట్టు కు ఎంపికైన క్రీడాకారిణి కి జిల్లా యువజన కాంగ్రెస్ ఉమ్మాజి నరేష్ ఆర్థిక సహాయం  అందజేశారు. జక్రాన్ పల్లి గ్రామానికి చెందిన గన్న లక్ష్మణ్ కూతురు గన్న వర్షిని కి నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు ఉమ్మాజీ నరేష్ అన్న గారూ ఖర్చుల నిమిత్తం 10.000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. అమ్మాయికి  ఆల్ ద బెస్ట్ తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు  వినోద్, డి సి సి కార్యదర్శి గన్న లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
Spread the love