
మండలంలోని మనుగొండ గ్రామానికి చెందిన కొల్లూరి హైమావతి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోనీ టీఏక్స్ హాస్పటల్లో చికిత్స పొందుతుంది. హైమావతి కుటుంబానికి రూ 20 వేలు, శాయంపేట గ్రామానికి సముద్రాల శ్రవణ్ ఇటీవలకాలంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు శ్రావణ కుటుంబానికి రూ 15 వేలు ఆర్థిక సహాయం సామాజిక వేత్త, కాంగ్రెస్ జిల్లా నాయకులు అల్లం బాలకిషార్ రెడ్డి సతీమణి స్వప్న అందచేశారు. ఈ కార్యక్రమంలో వీరగోని రాజ్కుమార్, మర్రెడ్డి, శోభన్, కందికొండ రాజు, సముద్రాల సతీష్, పోరాండ్ల రాజు, నాగరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.