దోస్తు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..

నవతెలంగాణ-తుర్కపల్లి
మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన పబ్బోజు చంద్రమౌళి చారి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వాసలమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన, 1991_92 సంవత్సర ఏడవ తరగతి విద్యార్థులు ఈ విషయాన్ని తెలుసుకొని ఆ కుటుంబం ఆదుకోవాలని తమ తోచిన విధంగా 10500 వందల రూపాయలు శుక్రవారం భార్యకు అందజేశారు.అనంతరం ఆ కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జల్తారు మధు, ఆరే నర్సింహులు, చింతల కుకుటప్పు, కొండల్, శ్రీపాద  బ్రహ్మచారి, సింగం లక్ష్మణ్, లక్కాకుల రాజేశ్వర్, పలుగుల రాజు, పలుగుల రామకృష్ణ, గడీల పాండరి, గోనె జహంగీర్, పలుగుల శ్రీనివాస్, బూడిద జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love