
భిక్కనూర్ మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భిక్కనూరు పట్టణానికి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ కుర్రి లింబాద్రికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, కార్యదర్శి సురేష్ లాల్, నవీన్, మండల అధ్యక్షులు లింబాద్రి, కార్యదర్శి శ్రావణ్ కుమార్, క్యాషియర్ సమీర్, బిక్షపతి, రాజేందర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.