
ములుగు జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామానికి చెందిన, గ్రామపంచాయతీ స్వీపర్ మంతెన ముత్తయ్య గారి భార్య నరసమ్మ అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని మంత్రి సీతక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ బెజ్జూర్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించి, దాన సంస్కారాల నిమిత్తం 5000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంతెన ముత్తయ్య కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, ఎక్స్ ఎంపీటీసీ నారాయణ, మొక్కటి కోటేష్, కాలేశ్వరం వీరాచారి, దాయ వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు, కాయితి లింగాచారి, సాంబశివరావు, రమేష్, వెంకన్న, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.