నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొల్లూరు గ్రామానికి చెందిన ఏదుల వెంకటేష్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా,వారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పారునంది భాస్కర్ గురువారం పరామర్శించి బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రూ.3,000 నగదు ఆర్థిక సహాయాన్ని అందించారు. అదేవిధంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి మృతుని కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందించి అండగా నిలిచారు. కష్టకాలంలో బాధిత కుటుంబాలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు గ్రామ సర్పంచ్ జనగాం సుధారాణి శ్రీ పాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గాజుల ఆంజనేయులు, వార్డు సభ్యులు మస్తాన్, పార్టీ నాయకులు గ్యాదపాక మల్లేష్, లక్ష్మయ్య గణేష్, బాలరాజు, నర్సింగ్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
మృతుని కుటుంబానికి ఆర్థిక చేయూత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



