మండలంలోని తాళ్ళ రాంపూర్ గ్రామానికి చెందిన బోదాస్ గంగాధర్ 15 రోజుల క్రితం ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుండి పడి మరణించారు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. వారి కుటుంబం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారని, విషయం తెలుసుకున్న తాళ్ళ రాంపూర్ గ్రామం “మన ఊరు మన బడి”యూఏఈ, ఎన్ఆర్ఐ సంఘం వారు బాధిత కుటుంబానికి రూ.50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మా గ్రామంలో ఆపదలో ఉన్నవారిని మా ఎన్ఆర్ఐ సంఘం తరపున ఆదుకోవాలని అనుకున్నామని, అందులో భాగంగానే బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో అందుబాటులో ఉన్న యూఏఈ ఎన్ఆర్ఐ ప్రతినిధులు ఆడేం ప్రతాప్, ఉత్కం శ్యామ్ సుందర్ గౌడ్, బండి సృజన్, బోదాస్ దేవేంధర్, గంగారెడ్డి పాల్గొన్నారు.