- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం కొయ్యుర్ గ్రామపరిధిలో వరి పొలాల్లో కోసిన కోయకాళ్లను, ఎండుగడ్డిని కాల్చడానికి గుర్తు తెలియనివారు పెట్టిన నిప్పుతో మంటలు చెలరేగాయి. పొలాల ప్రక్కన రైతులు విక్రయించడానికి అరబోసిన ధాన్యం కుప్పలకు మంటలు అంటుకునే పరిస్థితిని రైతులు వెంటనే గమనించి అగ్నిమాపక వాహనానికి సమాచారం ఇచ్చారు. కొద్ధి క్షణాల్లో అగ్నిమాపక వాహనం చేరుకొని మంటలు అర్పివేయడంతో పెనుప్రమాదం తప్పడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -



