నిమ్స్‌లో…ఏడాదిలో వెయ్యి మార్క్‌ దాటిన ఫిస్టుల సర్జరీలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏడాది కాలంలో వెయ్యికిపైగా ఫిస్టుల ఆర్టిరియో వీనస్‌ సర్జరీలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా వాస్కులర్‌ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించారు. నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప మాట్లాడుతూ, ఇలాంటి సర్జరీలు ఇంకా చేసేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వాస్కులర్‌ సర్జరీ డిపార్ట్‌ మెంట్‌ విభాగాధిపతి డాక్టర్‌ సందీప్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ నిమ్మ సత్యనారాయణ, డీన్‌ లీజా రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love