మత్స్యరంగం అభివృద్ధికి వెయ్యి కోట్ల రుణం

– ఫిషరీస్‌ ఫెడరేషన్‌ చైర్మెన్‌ పిట్టల రవీందర్‌ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో మత్య్స రంగం అభివృద్ధి చేయడంతోపాటు మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మరో వెయ్యికోట్ల రుణ సదుపాయాన్ని కల్పించేందుకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) తన సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు తెలంగాణ ఫిషరీస్‌ ఫెడరేషన్‌ చైర్మెన్‌ పిట్టల రవీందర్‌, వైస్‌ చైర్మన్‌ దీటి మల్లయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలోని ఎన్సీడీసీ ప్రధాన కార్యాలయంలో వారు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అశోక్‌ పెళ్లయి, డిప్యూటీ డైరెక్టర్‌ పాటిల్‌ నీలేష్‌ సురేష్‌లను కలిశారు. మొదటి దశలో అమలు జరిపిన సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా సుమారు ఒక లక్ష 18 వేలమందికి ప్రత్యక్షంగా లబ్ది చేకూరిందని అధికారులకు వారు వివరించారు.

Spread the love