డాక్టరేట్‌ సాధించిన గుమ్మడవల్లి వాసి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి గ్రామానికి చెందిన అత్తునూరి వెంకటరామి రెడ్డి, కుమారి దంపతుల కుమారుడు అత్తునూరి నాగిరెడ్డి హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీలో లోహ ఉత్ప్రేరక సమక్షంలో ఆల్కైన్‌ల క్రియాశీలత అను అంశం మీద విశేష పరిశోధనలు జరిపారు. ఆ పరిశోధనలకుగాను సీఎస్‌ఐఆర్‌-ఏసీఎస్‌ఐఆర్‌ సంయుక్తంగా నాగిరెడ్డికి డాక్టరేట్‌ ప్రధానం చేసింది. పేద కుటుంబానికి చెందిన డీఎస్‌ టీ-ఇన్‌స్పైర్‌ స్కాలర్‌షిప్‌ని పొందారు. రసాయన శాస్త్రం మీద ఉన్న మక్కువతో కష్టపడి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ పూర్తి చేశారు. ఈ సమయంలో యుజిసి అందించు మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పొందడమే కాకుండా, ఐఐటీ కాన్పూర్‌లో రెండు నెలల ప్రాజెక్ట్‌ చేశారు. ఈ సమయంలో కర్బన సమ్మేళనాలు మరియు వాటి ఉపయోగాలు బాగా ఆకర్షించాయి. సీఎస్‌ఐఆర్‌ -ఐఐసీటీ హైదరాబాద్‌లో సీటు సంపాదించారు సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎమ్‌. శ్రీధర్‌ రెడ్డి దగ్గర 2018లో జాయిన్‌ అయి నిర్విరామంగా రోడియం, పెల్లాడియం ఉత్ప్రేరకాలని ఉపయోగించి ఆల్కైన్‌ల ద్విచక్ర, పాలిచక్ర సమ్మేళనాల అభివృద్ధి గురించి వివిధ పద్ధతులని కనిపెట్టారు.

Spread the love